ఓపలేని అత్తకు వంగలేని కోడలన్నట్టు..

బద్ధకంలాంటి వాటిలో ఒకరిని మించినవారు ఇంకొకరు అని వ్యంగ్యంగా చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. అత్తకు ఓపిక లేదు ఏ పని చేసుకోలేదు అని అనుకొంటే ఆమెకు వచ్చిన కోడలు కూడా వంగటానికి ఇబ్బంది పడుతూ ఏ పనీ చెయలేని స్థితిలో ఉండిపోయిందట. ఇదే తీరులో ఒక వ్యక్తి తనకు అప్పచెప్పిన పని తన వల్ల కాదని ఇంకొకరి సహాయం అడిగితే వారంతకన్నా శక్తిహీనులమని చెబుతున్నప్పుడు ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net