కలిగిన వారికి అందరూ చుట్టాలే..

లోకం తీరును వివరించే జాతీయం ఇది. కలిగిన వారు అనంటే సంపదలు కలిగినవారు అని అర్థం. డబ్బు లేని పేదవాడిని ఎవరూ తనవాడు అని చెప్పుకోరు. అదే తెలిసిన వారిలో ఎవరైనా ధనవంతులో లేదా పలుకుబడి కలిగినవారో ఉంటే ఎక్కడో ఒకచోట చుట్టరికాన్ని కలుపుకొని వాళ్ళు మా వాళ్ళేనంటూ గొప్పలు చెప్పుకోవటం చాలామంది దగ్గర కనిపిస్తుంది. అలాంటి వారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net