కడవేరు మిగిలినా గరిక చిగుర్చక మానదన్నట్టు

కార్యదక్షుల సంకల్పదీక్షను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. గరిక మొక్క అన్ని వేళ్లూ తెగిపోయినా, ఒకేఒక్క వేరున్నా మళ్లీ ఆ ఒక్క వేరుతోనే శక్తి పుంజుకొని చిగురుపెట్టి పెద్దదవుతుంది. అదే తీరులో సంకల్ప దీక్ష పోయినా ఏ ఒక్క చిన్న అవకాశం మిగిలి ఉన్నా దాంతోనే తన పని సాధించుకొస్తాడన్నది భావన. 'కడవేరు మిగిలినా గరిక చిగుర్చక మానదన్నట్టు ఈ ఒక్క అవకాశం చాలు వాడు మళ్లీ కోలుకోవటానికి' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్