కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి..

సమయానికి అన్నీ సమకూరినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎంతో కష్టపడితేకానీ లభించనివి సర్వం సిద్ధం అంటూ ముందుకొచ్చిన సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఇల్లు కట్టడమంటే సామాన్యమైన విషయంకాదు. ఎంతో శ్రమ పడాలి. అలాంటిది కట్టిన ఇల్లు సొంతమైనప్పుడు, ఏ శ్రమ లేకుండానే పొయ్యిపెట్టి ఉండి వంటకు సిద్ధంగా అన్నీ ఉన్నప్పుడు కలిగే ఆనందాలు ఎవరికైనా ఎప్పుడైనా ప్రాప్తించినప్పుడు ఈ జాతీయ ప్రయోగం వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్