ఏమీలేని వారికి ఎచ్చులు లావు

ఏమీలేని వానికి ఎచ్చులు లావు.. స్వాములవారికి జడలు లావు అన్నట్లు అన్నది జాతీయం. ఏ విషయమూ లేని వ్యక్తి తన లోపాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎచ్చులు చెబుతుంటాడన్నది సత్యం. అది ఎంతటి సత్యమంటే కొంతమంది స్వాములకు జుట్టు జడలు కట్టి ఉంటుంది. అది ఎంత సత్యమో ఇదీ అంతే సత్యం అని ఉదాహరణ పూర్వకంగా తెలియచెబుతూ ఎలాంటి విషయమూ లేని వాని మాటలను నమ్మవద్దని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్