కాశీనాథుని నాగేశ్వరరావు (1867 - 1938) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. దేశోద్ధారక అని ఆయనను అంతా గౌరవించేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది