భారత కోకిల శ్రీమతి సరోజినీ నాయుడు

Sarojini Naiduస్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహిళల కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన వారిలో సరోజినీనాయుడు ప్రముఖు రాలు. కవిత్వంతో మాధుర్యన్ని కురిపించి ' నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా' గా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

Rallapalli anantha krishna sharmaశాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.  అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు.

అయ్యదేవర కాళేశ్వరరావు

అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. ayyadevara kaleswara rao

భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాటం సాగించిన మహా నాయకులలో తొలితరం తెలుగు నాయకులు కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం మొదలైనవారు కాగా మలితరం మహానాయకులు డా.పట్ట్భాసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారు.
 

స్వామి రామానంద తీర్థ

ramananda teertaస్వామి రామానంద తీర్థ : స్వాతంత్ర సమరయోధుడు, హైద్రాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి, కార్మిక నాయకుడు, విద్యావేత్త. 

ఈయన అసలు పేరు వెంకటరావు ఖేడ్గీకర్‌. తండ్రి భాపూరావు, తల్లి యసుబాయి.1903 అక్టోబరు 3వ తేదీన అప్పటి హైదరాబాదు సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో ఆయన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1920 జూలై 31 వ తేదీ రాత్రి లోకమాన్య బాలగంగాధర తిలక్‌ కాలధర్మం చెందారన్న వార్త విని బ్రహ్మచారిగా తన జీవితాన్నంతా మాతృభూమి సేవకే అంకితం చేయగలను అని ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రకారమే ఉండిపోయిన ధీరోధాత్తుడు ఆయన. కళాశాల చదువుకు స్వస్తి చెప్పి, పూనాలోని తిలక్‌ విద్యాపీఠ్‌లో మూడేళ్ళు అధ్యయనం చేసి, ప్రజాస్వామ్యం, దాని క్రమాభివృద్ధి అనే అంశంపై సిద్ధాంత వ్యాసం రాసి పూనా విశ్వవిద్యాలయానికి సమర్పించి ఎం.ఏ పట్టాని పొందారు.
 

మాడపాటి హనుమంతరావు

Madapati Hanumantharaoఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు :  తెలుగు గడ్డను నైజాం పాలకులు ఏలుబడి కొనసాగుతున్న రోజుల్లో పారతంత్య్రంలో మగ్గిపోతున్న తెలుగుజాతిని మేల్కొలిపి వారిలో జాగృతి కలిగించి, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుల్లో ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ప్రథమ స్థానం వహిస్తారు.

ఎల్.వి.ప్రసాద్

L V Prasadఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత .. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎల్‌.వి. ప్రసాద్‌ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన  ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు.

స్వామీ వివేకానంద

swami vivekanada‘‘ఒక వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు. తాను బలహీనుడినని భావిస్తే బలహీనుడే అవుతాడు, బలవంతుడిని అని భావిస్తే బలవంతుడే అవుతాడు, కార్యసాధన యత్నంలో ఎదురయ్యే ఆటంకాలను, పొరపాట్లను లక్ష్యపెట్టకూడదు. ఓటమిని లెక్క చేయకూడదు. తిరోగమనాలనూ సహించాలి. లక్ష్యసాధన కోసం వెయ్యి ప్రయత్నాలైనా చేయాల్సిందే. అప్పటికీ ఫలించకపోతే మరో ప్రయత్నానికి సిద్ధం కావాలి’’

శాస్త్రీయ సంగీత రారాజు త్యాగరాజు

త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.

Tyagarajuసంగీతం అంటే కొంచెం తెలుసున్న వారెవరైనా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన అసమానమైన కృషి అలాంటిది. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉంది. లాగుడు పీకుడు రాగాలతో శాస్త్రీయ సంగీతం అంటే ఆమడ దూరం పరిగెత్తే జనాలకి, అందులో ఉండే మాధుర్యం, మత్తూ చూపించీ, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన వాడు త్యాగరాజు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని అజరామరం చేసాడు. రామ భక్తుడిగా తనదైన ప్రత్యేకమైన ముద్రతో సంగీతాన్ని భక్తి వాహకంగా వాడుకొన్న వ్యక్తి.
 

శ్రీశ్రీ

ఆధునికతకు విరాట్‌రూపం శ్రీశ్రీ. ఇంటిపేరు, ఒంటి పేరుల్ని క్లుప్తీకరించి అణువుల్లా పేర్చుకోవటంతో పేట్రేగిన ఆధునికత ఆపై కవిత్వమై పేలింది.

రెండక్షరాల శ్రీశ్రీ అంటే లోతు,
శ్రీశ్రీ అంటే ఎత్తు.
శ్రీశ్రీ కవిత్వం అగ్ని.
శ్రీశ్రీ సాహిత్యం మార్పు.
శ్రీశ్రీ ఓ నేత, ఓ దూత, ఓ భావి!

తిరుపతిలో ఘనంగా నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగుకు వరాభిషేకం జరిగింది. అమ్మ భాషపై కానుకల జల్లు కురిసింది.

తిరుపతిలో గురువారం అట్టహాసంగా ప్రారంభించిన 'నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల' వేదికపై నుంచి భాషాభివృద్ధికి తోడ్పాటును అందించే దిశగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పలు వరాలను గుప్పించారు.

  • తెలుగు భాష, సంస్కృతికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు
  • సంగీత, నాటక, సాహిత్య, లలితకళల అకాడమీలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
  • ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పదో తరగతి దాకా కచ్చితంగా తెలుగుభాష బోధనను చేపట్టాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. 
  • తెలుగును పాలనా, బోధనా, ప్రసార మాధ్యమ భాషగా సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఉద్ఘాటించారు.
  • ఇప్పటికే తెలుగుభాషకు ప్రాచీన హోదా సాధించామని.. రాష్ట్ర రాజధానిలో తెలుగుపీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని గుర్తుచేశారు.

తెనుగు లెంక "తుమ్మల సీతారామమూర్తి"

Tummala Sitaramamurtyఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు.  పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్వి ష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు.

కాకతీయుల వైభవం

kakateeyulu  రుద్రదేవ మహారాజు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా నెలకొల్పి ఈ ఏటికి 850 సంవత్సరాలు, కాకతీయ మహా సామ్రాజ్ఞి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి ఈ ఏటికి 750 సంవత్సరాలు, హనుమకొండలో  వేయి స్థంబాల గుడి నిర్మించి ఈ ఏటికి 850 సంవత్సరాలు, అంతే కాదు పాలం పేటలోని ప్రసిద్ద రామప్ప దేవాలయం నిర్మించి కూడా ఈ ఏటికి 800 సంవత్సరాలు..

అలనాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీక.. శిల్పకళా సౌందర్యానికి నిలయం.. సాహితీ వేత్తల సౌరభాలు గుబాళించిన నేల.. వెలకట్టలేని 'కోహినూర్' పుట్టినిల్లు.. కాకతీయ సామ్రాజ్యం. శాతవాహనుల తర్వాత తెలుగు దేశాన్నంతా ఒక రాజకీయ ఛత్రం క్రిందకు తెచ్చి దేశ సమగ్రత, సమైక్యతను చేకూర్చిన తెలుగుపాలకులు కాకతీయులు. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులకు ఒక ప్రత్యేక, విశిష్టమైన స్థానం ఉంది. వీరు విశాల సామ్రాజ్యాన్ని పాలించడమే కాక పటిష్ట పరిపాలనావ్యవస్థను ప్రవేశపెట్టి వ్యవసాయానికి నీటి వనరులు కల్పించి,గ్రామీణ జనజీవితాలలో కళా సాహిత్యాలను సజీవపరిచి, విశిష్టమైన దేవాలయ నిర్మాణాలను కావించి, తెలుగువారి రాజకీయ, సాంస్కృతిక వారసత్వ జీవనానికి తోడ్పడినారు.కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.

ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌

c p brown1817, ఆగస్ట్‌ 13. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా.

ప్రజా పాటల త్యాగయ్య "గరిమెళ్ళ సత్యనారాయణ"

గరిమెళ్ళ సత్యనారాయణ"మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతలూగించాయి.

మాధవపెద్ది సత్యం

మాధవపెద్ది సత్యంరంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది
పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది

దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు....
ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది

ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ......
ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది

ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త "సూర్యకాంతం"

suryakantamసూర్యకాంతం, ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె పాత్రలు అంతగా ప్రజా జీవితంలోకి చొచ్చుకుని పోయాయి. సూర్యకాంతం తెర మీద పాత్రలను ఎంత అద్భతంగా పోషించేవారో.. నిజ జీవితంలో అంతే ఉన్నతంగా జీవించేవారు.

రాణీ రుద్రమదేవి

రాణీ రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు. నిరవద్యపుర(నిడదవొలు)పాలకుడు వీరభద్ర ఛాళుక్యుడు ఈమె భర్త.

తెలుగు యునికోడ్ ఖతులు (ఫాంట్స్)

ఇప్పుడు తెలుగులో కొత్త యునికోడ్ ఖతులు(fonts) అందుబాటులో ఉన్నాయి .. ఇవి ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రబుత్వం అందుబాటులో ఉంచింది.. ఈ ఖతులను మీ కంప్యూటర్ లో నిక్షిప్తం చేసుకొని వాడుకోవచ్చు.. వివరాలకు ఈ క్రింది లంకెను చూడండి

http://teluguvijayam.org/fonts.html

 

తరతరాల తెలుగుదనం... కోల్పోతున్నాం మనం

మేల్కోవాల్సిన తరుణం

    కోతికొమ్మచ్చులు, గోటింబిళ్లలు, గోదారీతలు, ఇసుకగుళ్లు, పాకంజీళ్లు, పప్పుబెల్లాలు, తొక్కుడుబిళ్లలు, వామనగుంటలు, వల్లంకి పిట్టలు, పట్టుపరికిణీలు, వెండిపట్టీలు, వైకుంఠపాళీలు, రుక్మిణీ కల్యాణాలు... ఏమయ్యాయి ఇవన్నీ? ఇవి అంతరించడం అంటే తెలుగుదనం అంతరించడం కాదూ?

Teluguమనిషి పుట్టుకకు ముందే మాతృభాషతో బంధం మొదలవుతుంది. అమ్మ మాట్లాడుతున్న చిన్న చిన్న మాటలను కడుపులోని బిడ్డ గ్రహించి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని, అలా అమ్మభాషను తన భాషగా సొంతం చేసుకునేందుకు ఆయత్తమవుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఎంతమందిలో ఉన్నా అమ్మ గొంతును పసివాడు గుర్తించడం, స్పందించడంలోని రహస్యం అదేనని తేల్చారు. అలా అమ్మనుంచి నేర్చిన భాష కనుక అది మనకు అమ్మభాష అవుతోంది. అమ్మభాషతో మనిషి బంధం ఉమ్మనీటిలో ఉన్ననాటిది! పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన ఆంధ్ర జాతికి అమ్మభాష తెలుగు. ఇంతమందికి ఇంటి నుడిగా స్థిరపడిన భాషలు ప్రపంచంలోనే బాగా అరుదు. అంతటి ఘనత వహించిన తెలుగు భాష 2030 నాటికి అంతరించిపోయే ప్రమాదంలో పడినట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

Pages

Subscribe to తెలుగుబిడ్డ RSS