మహానటి సావిత్రి

savithriసావిత్రిని, ఆమె పోషించిన పాత్రలను మరిచిపోవడం ఆయా సినిమాలను చూసిన ప్రేక్షకుల తరంకాదు. జగతి మరువలేని నటిసావిత్రి. అమె నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంథాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె జీవించిన చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. ఆమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి. పాత్రలో ఆమె ఒదిగిపోయినట్లు మరెవ్వరూ ఒదిగిపోలేరు. అందుకే నటీ శిరోమణి అయింది.

ఘంటసాల

Ghantasalaఘంటసాల వెంకటేశ్వరరావు గారు (1922, డిసెంబర్ 4 - 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.  ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు.

నేడు గురజాడ అప్పారావు గారి వర్దంతి

ఈ రోజు గురజాడ అప్పారావు గారు మరణించిన రోజు (నవంబర్ ౩౦)

గురజాడ అప్పారావు

డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య

భోగరాజు పట్టాభి సీతారామయ్యభోగరాజు పట్టాభి సీతారామయ్య  స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు.  డాక్టర్‌గా తెలుగు భాషాభిమానిగా, ఖద్దరు దారిగా, స్వాతంత్య్ర సమరశీలిగా, మహాత్మాగాంధీకి ఆప్తునిగా, రాజకీయ చతురునిగా, నిరంతర ప్రజా సేవకునిగా, ముక్కుసూటి మనిషిగా మన్ననలందుకొన్నారు సీతారామయ్య. సామాన్య ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేని రోజుల్లో, అప్పులకోసం అన్నదాతలు ఎదురు తెన్నులు చూస్తున్న రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారాయన.

1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు.  1948లో జైపూర్‌ కాంగ్రెస్‌ సమావేశం నాటికి కాంగ్రెస్‌ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్‌ కంపెని (1925), హిందు స్తాన్‌ ఐడియల్‌ ఇన్సూరెన్స్‌ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించారు.

నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన ఆయనకు రాష్ట్ర మంత్రి వర్గంలో అవకాశం తలుపుతట్టినా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి పదవి గుమ్మం వరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగిపోయిన మహనీయుడు డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు

childrenచాచా నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14ను మనదేశంలో  "బాలల దినోత్సవం"గా జరుపుకుంటున్నాము. చాచా నెహ్రూ మనదేశానికి తొలి ప్రధానమంత్రి. స్వాతంత్ర్యం కోసం తెల్లవారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మాగాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్యం సంపాదించిన తరువాత మన దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రిగా ఈయన పనిజేశారు.

దీపావళి శుభాకాంక్షలు

తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు

diwali

నరక చతుర్థ్ద్దశి శుభాకాంక్షలు

ఆశ్వీయుజ మాసంలో బహుళపక్ష చతుర్దశి ‘నరక చతుర్దశి’. దీపావళి ముందు రోజు నరక చతుర్థ్ద్దశి . శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామా సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక దీనికి ‘నరక చతుర్థ్ద్దశి’ అనే పేరు ఏర్పడింది. దీనికి సంస్కృతంలో ‘కాళ చతుర్దశి’ అంటే అంధకార చతుర్థ్ద్దశి అని పేరు. నరక చతుర్దశికి ‘ప్రేతచతుర్దశి’ అని కూడా పేరుంది. అభ్యంగ స్నానంవల్లా..యమ తర్పణం ఆచరించడంవల్ల మరణానంతరం నరకలోక బాధలు వుండవని కథనం.
narakasura vadanam
ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘నరక చతుర్దశి’ అంటరు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై లోక కంటకుడైన నరకాసురుని సంహరించాడు.  సర్వలోకాలకు, దేవతలకు ఆనందాన్ని కలిగించిన ఆ రోజును జనమంతా ‘నరక చతుర్దశి’గా జరుపుకోసాగారు.

ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

AndraPradeshనవంబర్ 1 వ తేదీ అంటే ఇవాళ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినం. 1953 వ సంవత్సరం ఇదే రోజు పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో విలీనం చేసారు.
 

రావు బహదూర్ "కందుకూరి వీరేశలింగం పంతులు" గారు

కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.

కందుకూరి వీరేశలింగం పంతులు

విశిష్టత

ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:

  • మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
  • మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
  • తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
  • తెలుగులో తొలి నవల రాసింది ఆయనే
  • తెలుగులో తొలి ప్రహసనం రాసింది కందుకూరి
  • తెలుగుకవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి
  • విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత

ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసాడు.

తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన. యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.

దసరా శుభాకాంక్షలు

తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు

దుర్గాదేవిబతుకమ్మ

విజయదశమి (దసరా)

విజయదశమిదసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ(అశ్వనీ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే అది ఆశ్వీయుజ మాసమౌతుంది.) శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు. ఈ నవరాత్రుల లో దుర్గమ్మ ని తొమ్మిది విధాలుగా అంటే బాలాత్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీలతా త్రిపురసుందరి, దుర్గ, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరిగా భావించి విభిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు. పదవ రోజు విజయదశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. 

దేవీ నవరాత్రులు

దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం ఏమిటి ? అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో ఎందుకు కొలుస్తారు. నవరాత్రుల వెనుక అసలు చరిత్ర ఏంటి ?

దేవీ నవరాత్రులుప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులని అంటారు.  శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది.  ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక  ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్‌||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

భాగ్యనగరం

భాగ్యనగరంఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం హైదరాబాద్‌. దీనిని భాగ్యనగరం అని కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1591లో మహ్మద్‌కులీకుతుబ్‌ షా దీనిని నిర్మించాడు. కుతుబ్‌ షాహీ వంశంలో ఆయన అయిదో రాజు. ఈ నగరానికి 400ఏళ్ల చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్‌, గొల్కొండ కట్టడాలు మకుటాయమానం. ప్రత్యేక రాజ్యంగా అనేక ఏళ్లు వర్థిల్లిన హైదరాబాద్‌ ఎట్టకేలకు 1948 సైనిక చర్య తర్వాత భారత్‌లో అంతర్భాగమైంది.

సాహిత్య విమర్శకుడుగా గురజాడ

Gurajada apparao‘కన్యాశుల్కం’ నాటకం ఇవాల్టికీ గురజాడ కళా సృష్టికి దర్పణంగా నిలుస్తోంది. ‘ముత్యాల సరాలు’ ఛందస్సులో ఆయన తెచ్చిన గొప్ప మార్పుకి ప్రతీకగా నిలుస్తోంది. ‘తెలుగు కవిత్వంలో నేను కొత్త, ఎక్స్పెరిమెంట్‌ ఆరంభించాను. నా ముత్యాల సరాల రీతిని మీరు గమనించినట్లయితే మీకే ఈ విషయం ధృవపడుతుంది... నా మొదటి గేయంలో సాధ్యమైనన్ని వాడుక మాటలను, గ్రాంధిక వ్యాకరణ సూత్రాలకు, లేదా ప్రాచీన కవుల పద్ధతులకు ఒదగని శబ్దాలను ప్రయోగించాను’ అని ఆయన ఒక లేఖలో రాశారు.

భిన్నపార్శ్వాల గురుజాడ

నేడు గురజాడ అప్పారావు గారి 150వ జయంతి

  జాతీయతాస్ఫూర్తి భారత దేశమంతటా వెల్లివిరుస్తున్న రోజుల్లో కలం పట్టిన యోధుడు గురజాడ. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి భారత యువత కొట్టుమిట్టాడుతున్న సమయంలో వారికి భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్య వైభవాలను గుర్తుచేయడంతోపాటు పాశ్చాత్య లోకానికి భారతీయ ఔన్నత్యాన్ని తెలియజేయాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించిన దీర్ఘదర్శి- గురజాడ.

వినాయక చవితి శుబాకాంక్షలు

వినాయకుడుతెలుగు వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

అందరూ పర్యావరణానికి అనుకూలమైన మట్టి వినాయకుడినే పూజించమని మనవి

బండెనుక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి

బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లె వస్తవ్ కొడుకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో
నైజాము సర్కరోడా

 

పోలీసు మిలిట్రి రెండు
బలవంతులనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కరోడా

 

తెలంగాణ విమోచనానికి 64 ఏళ్లు

భూమి కోసం... విముక్తి కోసం తెలంగాణా ప్రజలు సాగించిన పోరాటానికి ఫలితం దక్కిన రోజు. భూస్వాముల అరాచకత్వం... నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ తెలంగాణా జనం ఏకమై కదం తొక్కారు. నాలుగున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయినా మడమ తిప్పకుండా తెగువ చూపారు. రజాకారుల దుశ్చర్యలకు ఎదురొడ్డి సాగించిన ఆనాటి సాయుధ పోరాటానికి నిజాం నవాబు తలవంచక తప్పలేదు.
 

రావి నారాయణరెడ్డి

రావి నారాయణరెడ్డిరావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. 1908 జూన్ 4న జన్మించాడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశారు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశారు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించారు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం.

నేడు "కవి సామ్రాట్ " శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మదినం.

విశ్వనాథ సత్యనారాయణవిశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సామ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలిజ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు.

Pages

Subscribe to తెలుగుబిడ్డ RSS