తెలుగుకు వరాభిషేకం జరిగింది. అమ్మ భాషపై కానుకల జల్లు కురిసింది.
తిరుపతిలో గురువారం అట్టహాసంగా ప్రారంభించిన 'నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల' వేదికపై నుంచి భాషాభివృద్ధికి తోడ్పాటును అందించే దిశగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పలు వరాలను గుప్పించారు.
-
తెలుగు భాష, సంస్కృతికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు
-
సంగీత, నాటక, సాహిత్య, లలితకళల అకాడమీలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
-
ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పదో తరగతి దాకా కచ్చితంగా తెలుగుభాష బోధనను చేపట్టాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు.
-
తెలుగును పాలనా, బోధనా, ప్రసార మాధ్యమ భాషగా సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఉద్ఘాటించారు.
-
ఇప్పటికే తెలుగుభాషకు ప్రాచీన హోదా సాధించామని.. రాష్ట్ర రాజధానిలో తెలుగుపీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని గుర్తుచేశారు.