తెలుగు వెలుగులు

తిరుపతిలో ఘనంగా నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగుకు వరాభిషేకం జరిగింది. అమ్మ భాషపై కానుకల జల్లు కురిసింది.

తిరుపతిలో గురువారం అట్టహాసంగా ప్రారంభించిన 'నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల' వేదికపై నుంచి భాషాభివృద్ధికి తోడ్పాటును అందించే దిశగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పలు వరాలను గుప్పించారు.

  • తెలుగు భాష, సంస్కృతికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు
  • సంగీత, నాటక, సాహిత్య, లలితకళల అకాడమీలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
  • ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పదో తరగతి దాకా కచ్చితంగా తెలుగుభాష బోధనను చేపట్టాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. 
  • తెలుగును పాలనా, బోధనా, ప్రసార మాధ్యమ భాషగా సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఉద్ఘాటించారు.
  • ఇప్పటికే తెలుగుభాషకు ప్రాచీన హోదా సాధించామని.. రాష్ట్ర రాజధానిలో తెలుగుపీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని గుర్తుచేశారు.

కాకతీయుల వైభవం

kakateeyulu  రుద్రదేవ మహారాజు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా నెలకొల్పి ఈ ఏటికి 850 సంవత్సరాలు, కాకతీయ మహా సామ్రాజ్ఞి రుద్రమదేవి పట్టాభిషేకం జరిగి ఈ ఏటికి 750 సంవత్సరాలు, హనుమకొండలో  వేయి స్థంబాల గుడి నిర్మించి ఈ ఏటికి 850 సంవత్సరాలు, అంతే కాదు పాలం పేటలోని ప్రసిద్ద రామప్ప దేవాలయం నిర్మించి కూడా ఈ ఏటికి 800 సంవత్సరాలు..

అలనాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీక.. శిల్పకళా సౌందర్యానికి నిలయం.. సాహితీ వేత్తల సౌరభాలు గుబాళించిన నేల.. వెలకట్టలేని 'కోహినూర్' పుట్టినిల్లు.. కాకతీయ సామ్రాజ్యం. శాతవాహనుల తర్వాత తెలుగు దేశాన్నంతా ఒక రాజకీయ ఛత్రం క్రిందకు తెచ్చి దేశ సమగ్రత, సమైక్యతను చేకూర్చిన తెలుగుపాలకులు కాకతీయులు. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులకు ఒక ప్రత్యేక, విశిష్టమైన స్థానం ఉంది. వీరు విశాల సామ్రాజ్యాన్ని పాలించడమే కాక పటిష్ట పరిపాలనావ్యవస్థను ప్రవేశపెట్టి వ్యవసాయానికి నీటి వనరులు కల్పించి,గ్రామీణ జనజీవితాలలో కళా సాహిత్యాలను సజీవపరిచి, విశిష్టమైన దేవాలయ నిర్మాణాలను కావించి, తెలుగువారి రాజకీయ, సాంస్కృతిక వారసత్వ జీవనానికి తోడ్పడినారు.కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.

తెలుగు యునికోడ్ ఖతులు (ఫాంట్స్)

ఇప్పుడు తెలుగులో కొత్త యునికోడ్ ఖతులు(fonts) అందుబాటులో ఉన్నాయి .. ఇవి ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రబుత్వం అందుబాటులో ఉంచింది.. ఈ ఖతులను మీ కంప్యూటర్ లో నిక్షిప్తం చేసుకొని వాడుకోవచ్చు.. వివరాలకు ఈ క్రింది లంకెను చూడండి

http://teluguvijayam.org/fonts.html

 

తరతరాల తెలుగుదనం... కోల్పోతున్నాం మనం

మేల్కోవాల్సిన తరుణం

    కోతికొమ్మచ్చులు, గోటింబిళ్లలు, గోదారీతలు, ఇసుకగుళ్లు, పాకంజీళ్లు, పప్పుబెల్లాలు, తొక్కుడుబిళ్లలు, వామనగుంటలు, వల్లంకి పిట్టలు, పట్టుపరికిణీలు, వెండిపట్టీలు, వైకుంఠపాళీలు, రుక్మిణీ కల్యాణాలు... ఏమయ్యాయి ఇవన్నీ? ఇవి అంతరించడం అంటే తెలుగుదనం అంతరించడం కాదూ?

Teluguమనిషి పుట్టుకకు ముందే మాతృభాషతో బంధం మొదలవుతుంది. అమ్మ మాట్లాడుతున్న చిన్న చిన్న మాటలను కడుపులోని బిడ్డ గ్రహించి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని, అలా అమ్మభాషను తన భాషగా సొంతం చేసుకునేందుకు ఆయత్తమవుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఎంతమందిలో ఉన్నా అమ్మ గొంతును పసివాడు గుర్తించడం, స్పందించడంలోని రహస్యం అదేనని తేల్చారు. అలా అమ్మనుంచి నేర్చిన భాష కనుక అది మనకు అమ్మభాష అవుతోంది. అమ్మభాషతో మనిషి బంధం ఉమ్మనీటిలో ఉన్ననాటిది! పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన ఆంధ్ర జాతికి అమ్మభాష తెలుగు. ఇంతమందికి ఇంటి నుడిగా స్థిరపడిన భాషలు ప్రపంచంలోనే బాగా అరుదు. అంతటి ఘనత వహించిన తెలుగు భాష 2030 నాటికి అంతరించిపోయే ప్రమాదంలో పడినట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

Subscribe to RSS - తెలుగు వెలుగులు