గుజరాత్ లో మూడవ సారి నరేంద్రమోడీ ఘన విజయం

తేది : 
Thursday, December 20, 2012
<p>గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ వూహించిన విధంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి, భాజపా నేత మోడీ విజయబావుటా ఎగురవేశారు. ఆయన ఒంటి చేత్తో భాజపాను మూడోసారి అధికారంలోకి తీసుకురాగలిగారు. ఈ గెలుపుతో ఆయన హ్యాట్రిక్‌ సాధించినట్త్లెంది. వరుసగా మూడోసారి ఆయన గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 182 స్థానాల్లో 121 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యం సాధించారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి, విజయఢంగా మోగించిన మోడీని.. కాంగ్రెస్‌ వ్యూహాలు అడ్డుకోలేకపోయాయి. కాంగ్రెస్‌ అగ్రనేతలుగా ఉన్న సోనియా, రాహుల్‌, ప్రధాని సైతం పెద్దఎత్తున ప్రచారం నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఈ ఎన్నికల ఫలితాలతో.. 2014లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు భాజపా తరఫున మోడీ.. ప్రధానమంత్రి పదవికి సరైన అభ్యర్థిగా పార్టీలో కొందరు నేతలు ఇప్పటికే పేర్కొంటున్నారు.</p>