<p>జీవీఎంసీ 69వవార్డు జడ్పీ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఇళ్లల్లో నివసిస్తున్న వారంతా కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. బోడి విజయ అనే మహిళ ఇంటి వెనుక నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి గాలి తోడవటంతో మిగిలిన ఇళ్లన్నీ కాలిపోయాయి.</p>