లోకమందుబుట్టి లోకమందె పెరిగి

పధ్యం:: 

లోకమందుబుట్టి లోకమందె పెరిగి 
లోక విభవమోర్వలేక జనుడు 
లోకమందు జనికి లోబడి చెడిపోవును 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: 
భూమిమీదే పుట్టి పెరిగి పెద్దయిన మానవుడు భూమిమీద వృద్ధి చెందిన సంపదలకు తాను సృష్టించిన సొమ్ముకు భోగభాగ్యాలకు దాసోహమై చెడిపోతున్నాడు.