మొండికి సిగ్గులేదు మొరటుకు ఎగ్గు లేదు

మానవ మనస్తత్వాల విశ్లేషణ చేసే జాతీయాలలో ఇది కూడా ఒకటి. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచించుకోకుండా మొండిగా కొందరు వ్యవహరిస్తుంటారు. ఈ వ్యవహారం సిగ్గులేనితనంగా కూడా ఉంటుంది. అలాగే మొరటుగా మరికొందరు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివారు ఎగ్గును లెక్కచేయరు. ఎగ్గు అనంటే కీడు అనర్థం. మొరటుగా ఆలోచించేవారు తమకు కీడు కలుగుతుందన్న ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తారన్నది భావన. ఆ భావనల ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ీమొండికి సిగ్గులేదు మొరటుకు ఎగ్గు లేదన్నట్టుంది నీ ప్రవర్తన. దాన్ని మార్చుకోవటం మంచిది' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
eenadu.net