కళ్లు మూయవచ్చుగానీ...

బలవంతంగా ఎవరిచేత ఏ పనీ చేయించలేము అని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఎవరైనా కలలు కనాలంటే వారి మానసిక స్థితి ఆ కలలకు సంబంధించినదిగా ఉండాలి. అంతేగాని కళ్లు మూసుకొని నిద్రపోతే కలలు వస్తాయి కదా అనుకొని అందరినీ కళ్లుమూసుకోండి కలలు కనండి అని బలవంతపెడితే కళ్లు మూసుకుంటారేమో కాని కలలు కంటారన్న మాట మాత్రం సత్యదూరంగానే ఉంటుంది. ఈ భావన ఆధారంగానే ఏ వ్యక్తి చేత కూడా బలవంతంగా ఏ పని చేయించలేము అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు.

మూలం/సేకరణ: 
eenadu.net