అదును చూసి పొదలో చల్లినా పండుతుందన్నట్టు

సమయ సందర్భాలను, సమయస్ఫూర్తిని పాటించినప్పుడే ఎవరికైనా విజయం దక్కుతుందనే విషయాన్ని వివరించి చెప్పే జాతీయం ఇది. సక్రమంగా వర్షాలు కురిసే నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. నేలమీద పొదలు అడ్డమున్నా ఆ పొదల నుంచి జారి నేలమీద పడ్డ గింజలు నేల అదునుగా ఉంటే పండితీరుతాయి. ఇలాగే సమయం, సందర్భం కలిసొచ్చి సమయస్ఫూర్తితో వ్యవహరించినప్పుడే అంతా సక్రమంగా నడుస్తుందని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net