భోజుడు వంటి రాజు ఉంటే, కాళిదాసులాంటి కవి ఉంటాడన్నట్టు..

పాలకులను బట్టే ప్రజల జీవన విధానం ఉంటుందని తెలియ చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. భోజమహారాజు ప్రజలను చక్కగా పాలిస్తూ కవులను ఆదరించాడు కనుకనే కాళిదాసులాంటి కవి వెలుగు చూడగలిగాడు. కనుకనే సమాజంలో కళలు, కవిత్వం లాంటివన్నీ వృద్ధి చెందాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా సానుకులంగా స్పందించాలని తెలియచెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net