ఆరాటమేకానీ పోరాటం లేదన్నట్టు

బద్ధకస్తులైన ఆశపోతుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆశతో ఇది నాకు కావాలి అని ఆరాటపడిపోతే చాలదు. కావాలనుకున్న దాన్ని సాధించుకొనేందుకు పోరాటం చేయాలి. అలా పోరాడి నిజాయతీగా కావలసిందేదో దాన్ని దక్కించుకోవాలి తప్ప నాకది కావాలి అని వూరక అనుకొంటూ కూర్చుంటే సరిపోదు అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net