ఎద్దుకు చొప్పవేసి ఆవును పాలియ్యమన్నట్టు..

దౌర్జన్యం చేసేవారిని పెంచి పోషిస్తూ మంచివారిని పనిచెయ్యండని ఒత్తిడి చేస్తుంటారు కొందరు. అలాంటివారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఆవు సాధుజంతువు. ఎద్దును బలవంతులకు పోలికగా చెబుతారు. ఈ పోలికే ఈ జాతీయ ఆవిర్భావానికి వేదికైంది. 'ఎద్దుకు చొప్పవేసి ఆవును పాలిమ్మన్నట్టు ఉన్నదంతా వాళ్లకే పెట్టి, చెయ్యాల్సిదంతా వాళ్లకే చేసి మమ్మల్ని చాకిరీ చేయమనటం ఏమీ బాగాలేదు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
eenadu.net