వడ్డీ వేగానికి వడిగుర్రాలు కూడా ఆగవన్నట్టు..

వడ్డీకి డబ్బు అప్పు తెచ్చిన వారి బాధను తెలిపే జాతీయం ఇది. వడ్డీ కట్టేశాం కదా అని అనుకొనేంతలోపే మళ్లీ నెల తిరిగి రావటం, తిన్నా తినకపోయిన అప్పులవాళ్లకు వడ్డీ కట్టడం జరుగుతుంటుంది. వడ్డీ కట్టేరోజు ఎంతో వేగంగా వస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఆ వేగం ఎలాంటిదంటే బాగా వడిగా పరుగెత్తే గుర్రపు వేగంకన్నా ఎక్కువ వేగంగా ఉంటుందన్న భావన ఈ జాతీయ ఆవిర్భావానికి వేదిక.వడ్డీ వేగానికి వడిగుర్రాలు కూడా ఆగవన్నట్టు కనిపిస్తోంది. మొన్నే కదా వడ్డీ కట్టాం మళ్లీ ఇంతలోనే కట్టాల్సిన రోజు రానే వచ్చింది అనే లాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
eenadu.net