కొంతమంది ఎదుటివారు నిందించినప్పుడు దానికి తగిన రీతిలో నర్మగర్భంగా సమాధానాలు చెబుతుంటారు. అలా మాటకు మాట అనటం కూడా ఓ గొప్ప కళ. ఒకామె మరో ఆమెనుఛీ కుక్కా పో అని తిట్టిందట. దానికి ఎదుటామె ఏమాత్రం బాధపడకుండా, ీఏమక్కా పిలుస్తున్నావు' అన్నదట. కుక్క అక్క కుక్కే అవుతుంది కానీ మరొకటి కాదు. అలా చాలా తెలివిగా ఎవరైనా ఎక్కడైనా మాటకు మాట సమాధానం చెబుతున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.