చేతికొచ్చింది నోటికొచ్చిందాకా నమ్మకం లేనట్టు..

స్థిరం లేని వ్యవహారం, నమ్మకంలేని పని అనేలాంటి అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. చేతి నుంచి నోటికున్న దూరం తక్కువే అయినా చేతిలో ఉన్నదాన్ని నోట్లో పెట్టుకొనే లోపలే అది కింద పడిపోవటమో మరోలా పనికిరాకుండా పోవటమో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పటం ఈ జాతీయంలో పైపైకి కనిపిస్తున్న విషయం. అంటే అన్ని రకాలుగా ఇది నాదేనని అనుకొని ధైర్యంగా ఉన్నప్పుడు అది తనది కాకుండా పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. దీనికి కారణాలు అనేక రకాలుగా ఉండవచ్చు. అలా అనుకొన్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరు వూహించగలరు అనే విషయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పెద్దలు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net