హాని కలుగబోదు హరిమది నెంచెడు

పధ్యం:: 

హాని కలుగబోదు హరిమది నెంచెడు 
వాని కబ్దు పరము వసుధయందు 
పూని నిష్ఠమీరి పొదలక యుండుము 
విశ్వరాభిరామ వినురవేమ!

తాత్పర్యము: 
భగవంతుడిని మనస్సులో ధ్యానించే వారికి ఎలాంటి హాని జరగదు. అతడికి తప్పక ముక్తి లభిస్తుంది. అందుకే నిష్ఠతో దేవుడిని ధ్యానించి నిశ్చలంగా జీవించాలి.