ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగుళూరు అవుతుందన్నట్టు..

చుక్కల్లో చంద్రుడులాంటిది ఇది. అన్నిటికంటే అధికం అని చెప్పే సందర్భాలలో దీని ప్రయోగం కనిపిస్తుంది. ఇటువంటి జాతీయాలు స్థానికంగా మాండలికపరంగా ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటాయి. కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన బెంగుళూరు నగరం చాలా గొప్పది అని చెప్పటం దీనిలో పైపైకి కనిపించే విషయం. ఇద్దరు వ్యక్తుల నడుమ పుంగనూరు గొప్పదా? బెంగుళూరు గొప్పదా? అని వాదన జరిగినప్పుడు ఆవిర్భవించింది ఇది. అయితే దీన్ని విడిగా ఒక వస్తువునో, ఒక వ్యక్తినో గొప్ప అని, చాలా గొప్ప అని చెప్పాల్సివచ్చినప్పుడు వాడుతుంటారు. 'ఎన్ని పుంగనూర్లు అయితే ఒక్క బెంగుళూరుతో సమానమన్నట్టు మీ వాళ్లు ఎంతమంది ఉన్నా మావాడితో సమానులు కాలేరు' అని అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
eenadu.net