కలుపు తియ్యని మడి... దేవుడు లేని గుడి

ఏ పని చేసినా సంస్కారవంతంగా ఉండాలంటారు పెద్దలు. ఈ విషయాన్ని వ్యవసాయానికి ముడిపెట్టి చెప్పిన జాతీయం ఇది. మడిలో కలుపు తియ్యకుండా ఉంటే చేను బాగా పండటం కష్టం. దానివల్ల రైతుకు ఎలాంటి ఉపయోగం ఉండదు. గుడి అనగానే లోపల దేవుడి విగ్రహం ఉండి ఆ ప్రదేశమంతా సంస్కారవంతంగా పూజలు లాంటివన్నీ జరుగుతూ ఉండాలి. దేవుడు లేకపోతే గుడి ఉన్నా వృధానే. దేవుడు ఉన్నప్పుడే గుడికి విలువ పెరిగినట్టు కలుపు తీసినప్పుడే మడికి విలువపెరుగుతుంది ఈ పోలికలతో ఎవరైనాసరే తాము చేస్తున్న పనిలో చెడును దూరం చేసి మంచితనాన్ని సంస్కారవంతంగా పెంచుతున్నప్పుడు ఆ పని కలుపు తీసిన మడిలాగా, దేవుడున్న గుడిలాగా ఉంటుందని తెలియచెబుతుంది ఈ జాతీయం.

మూలం/సేకరణ: 
eenadu.net