హాకింగ్‌కు రష్యా 'ఫిజిక్స్' బహుమతి!

తేది : 
Tuesday, December 11, 2012
కృష్ణ బిలం' సిద్ధాంతకర్త స్టీఫెన్ హాకింగ్(70)కి రష్యాకు చెందిన 'ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్ ఫౌండేషన్' 18లక్షల పౌండ్ల విలువైన బహుమతిని ప్రకటించింది. ఆయనే కాకుండా లార్జ్ హడ్రన్ కాలిడర్(ఎల్‌హెచ్‌సీ)కి నాయకత్వం వహిస్తున్న లిన్ ఎవాన్స్, మరో ఆరుగురు శాస్త్రవేత్తలకు కూడా ఈ ఫౌండేషన్ బహుమతిని ప్రకటించింది. రష్యాలో ఇంటర్నెట్ మొగల్ యూరి మిల్నర్ నెలకొల్పిన ఈ ఫౌండేషన్ ఇచ్చిన బహుమతి మొత్తంతో తన మనువడికి విడిది గృహాన్ని(హాలిడే హోం) కొనుగోలు చేయాలని స్టీఫెన్ హాకింగ్ భావిస్తున్నారు. ఈ బహుమతిని ప్రకటించడంతో తనను గౌరవించినట్టైంది, తనకెంతో సంతోషంగా ఉందని హాకింగ్ పేర్కొన్నారు.