అగ్ని-1 ప్రయోగం విజయవంతం

తేది : 
Wednesday, December 12, 2012
పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని ఒడిసా తీరం నుంచి భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దీని బరువు 12 టన్నులు, పొడవు 15 మీటర్లు. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లి, 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. డీఆర్‌డీవోలోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ దీన్ని రూపొందించింది. అగ్ని క్షిపణి-1 రూపకల్పనలో డీఆర్‌డీఎల్, ఆర్‌సీఐతో పాటు హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా భాగస్వామ్యం వహించింది.