డిసెంబర్ 12: ఉత్తరాఖండ్ తొలి ముఖ్యమంత్రి నిత్యానంద స్వామి(85) బుధవారం కన్నుమూశారు. దీర్ఘకాలం గా అస్వస్థతతో బాధపడుతు న్న ఆయన ఇక్కడి కంబైన్డ్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఐ)లో తుదిశ్వాస విడిచారు. స్వామికి నలుగురు కుమార్తెలు. 2000లో ఉత్తరప్రదేశ్ నుంచి విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఉత్తరాఖండ్‌కు తొలి సీఎంగా పని చేశారు.