వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు,మరియు తెలుగు సినిమా అగ్రకథానాయకులలో ఒకడు.ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డు స్థాపించిన డి.రామానాయుడు కుమారుడు. ఈయన డిసెంబర్ 13, 1960 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు.