బెంగళూరు, డిసెంబర్ 13: అంధుల టి-20 ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌ను భారత జట్టు గెల్చుకుంది. గురువారం జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 29 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి, విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 258 పరుగులు సాధించింది. కేతన్ భాయ్ పటేల్ 98 పరుగులు చేసి భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం బ్యాటిగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 229 పరుగులు చేసింది. గ్రూప్ దశలో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్ ఫైనల్‌లో అదే స్థాయిలో రాణించలేకపోవడం గమనార్హం.