అంతర్జాతీయ హెచ్చరికలను, ఐక్యరాజ్య సమితి ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా బుధవారం దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా విజయవంతంగా ప్రయోగించిన విషయం తెల్సిందే. దీనిపై ప్రపంచదేశాలు మండిపడుతున్నాయి. ఇది రెచ్చగొట్టే చర్యేనని, రాకెట్ పేరుతో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారని అమెరికా, దాని మిత్రదేశాలు ఆరోపించాయి