నేడు భారత్‌కు రానున్న పాక్‌ హోంమంత్రి

తేది : 
Friday, December 14, 2012

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ హోం శాఖ మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌ నేడు భారత్‌కు రానున్నారు. ఈ సాయంత్రం ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారుల చర్చల అనంతరం కేంద్ర హోంమంత్రి షిండేతో కలిసి మాలిక్‌ భారత్‌-పాక్‌ విసా సరళీకరణ ఒప్పందంపై సంయుక్త ప్రకటన చేయనున్నారు. అనంతరం షిండే ఇచ్చే విందులో పాల్గొననున్నారు. రేపు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో మాలిక్‌ భేటీ కానున్నారు. లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్‌, జాతీయ భద్రతసలహాదారు శివ్‌శంకర్‌ మీనన్‌తో కూడా సమావేశం కానున్నారు.