ఈ ఏడాది వార్తల్లో వ్యక్తి.. కేజ్రీవాల్‌: యాహూ

తేది : 
Friday, December 14, 2012

[size= medium]న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది వార్తల్లో వ్యక్తుల జాబితాలో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించిన (సెర్చ్‌) ప్రముఖ వ్యక్తిగా శృంగార తార సన్నీ లియోన్‌ తొలిస్థానంలో నిలిచినట్లు ప్రముఖ సెర్చింజిన్‌ యాహూ గురువారం వెల్లడించింది. కేజ్రీవాల్‌ తర్వాతి స్థానాల్లో వరసగా గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీ, పాక్‌ సాహస బాలిక మలాలా, యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, రాబర్ట్‌ వాద్రాలు ఉన్నారు. 2012లో సైఫీనా (సైఫ్‌, కరీనా) జంట పెళ్లి సమాచారాన్ని నెటిజన్లు అత్యధికంగా పరిశీలించారు. క్రికెటర్లలో విరాట్‌ కోహ్లి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఇక ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన బాక్సర్‌ మేరీ కోమ్‌ను యాహూ భారత్‌లో 'ఈ ఏడాది వ్యక్తి'గా ఎంపిక చేసింది.[/size]