అమెరికా పాఠశాలలో కాల్పులు: 20 మంది మృతి

తేది : 
Saturday, December 15, 2012
<p>అమెరికా: అమెరికాలోని కనెక్టికట్&zwnj; రాష్ట్రం న్యూటౌన్&zwnj;లోని శాండీ హుక్&zwnj; ఎలమెంటరీ పాఠశాలలో ఓ అగంతుకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 12మంది విద్యార్థులతో సహా మొత్తం 20 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. కాల్పుల సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని పాఠశాల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాన్&zwnj;బరీ మేయర్&zwnj; మార్క్&zwnj; బౌటెన్&zwnj; తెలిపారు. పాఠశాలలో ఒక్కసారిగా కాల్పులు జరగడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. ఉపాధ్యాయులు కొందరు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.</p>