హైదరాబాద్‌-కర్ణాటకకు ప్రత్యేక హోదా

తేది : 
Tuesday, December 18, 2012
<p>హైదరాబాద్&zwnj; రాష్ట్రం నుంచి విడిపోయి కర్ణాటకలో విలీనమైన హైదరాబాద్&zwnj;-కర్ణాటక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించింది. ఈ మేరకు రాజ్యాంగంలో 371జే అధికరణం చేరుస్తూ 118వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ సవరణ బిల్లుకు మంగళవారం లోక్&zwnj;సభ 343-0 ఓట్ల తేడాతో ఆమోద ముద్రవేసింది. దీనివల్ల గవర్నర్&zwnj;కు ప్రత్యేకాధికారాలు లభిస్తాయి. గవర్నర్&zwnj; హైదరాబాద్&zwnj;-కర్ణాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొనే వెసలుబాటు కలుగుతుంది. గుల్బర్గా, బీదర్&zwnj;, రాయచూరు, కొప్పళ్&zwnj;, యాద్గిరి, బళ్లారి జిల్లాలతో కూడిన హైదరాబాద్&zwnj;-కర్ణాటక ప్రాంతాభివృద్ధికి ప్రత్యేక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో ఈ ప్రాంత ప్రజలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.</p>