వర్ధమాన కథానాయకుడు భరత్‌ అలియాస్‌ యశోసాగర్‌(26) మృతి

తేది : 
Wednesday, December 19, 2012

కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ధమాన కథానాయకుడు భరత్‌ అలియాస్‌ యశోసాగర్‌(26) మృతి చెందారు. బెంగళూరుకు 120 కి.మీ. దూరంలో నాలుగో నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు కల్వర్టు గోడను ఢీకొట్టింది. ముంబయినుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న విశ్వనాథరెడ్డి(23), ముందు సీట్లో కూర్చున్న యశోసాగర్‌కు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.