చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే

పధ్యం:: 

చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే 
ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప 
గోర్కులనెడి పెద్దకొమ్మలెండును గదా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: 
మనసు అనెడి వేరు తెగితేనేగాని, మాయ అనెడి వృక్షం నశించదు. అప్పుడే ఆశలనెడి కొమ్మలెండిపోయి ముక్తిని పొందవీలగును.