<p>అమెరికాకు చెందిన ఒలీవియా కల్పో మిస్ యూనివర్స్-2012గా ఎంపికైంది. ఫిలిప్పీన్స్, వెనెజులా దేశాలకు చెందిన సుందరీమణులు వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత్‌కి చెందిన శిల్పాసింగ్ టాప్ -16 వరకూ మాత్రమే చేరుకోగలిగింది. లాస్‌వెగాస్‌లోని ప్లానెట్ హాలీవుడ్‌లో జరిగిన ఈ అందాలపోటీలో గత ఏడాది విశ్వసుందరి కిరీటం గెలుచుకున్న అంగోలా వనిత లైలా లోప్స్ ఈ ఏటి విజేతకు కిరీటధారణ చేశారు.</p>