ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గతకొంతకాలంగా సచిన్ రిటైర్మెంట్ చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత వరల్డ్‌కప్‌లో ఇండియా విజయం అనంతరం సచిన్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అనుకున్నారు. అయితే ఇటీవల తన ఫాంపై విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వన్డే క్రికెట్ నుంచి సెలవు తీసుకుంటున్నట్లు ఈరోజు ప్రకటించాడు. కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే పాక్ సిరీస్‌కు నేడు ఇండియా జట్టు ఎంపిక నేపథ్యంలో వన్డే క్రికెట్‌కు సచిన్ గుడ్‌బై చెప్పడం గమనార్హం.