అహ్మదాబాద్, డిసెంబర్ 26 : గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ కమలా బేణివాల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా మోడీ వరుసగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అగ్రనేతలు తరలివచ్చారు.