నరపతుల మేరదప్పిన

పధ్యం:: 

నరపతుల మేరదప్పిన
దిర మొప్పగ విధవ ఇంట దీర్పరియైనన్
గరణము వైదికుఁడయినను
మరణాంతకమౌనుగాని మానదు సుమతీ!

తాత్పర్యము: 
రాజు హద్దుమీరి ప్రవర్తించినా, శాశ్వతంగా విధవ ఇంట పెత్తందారైనా, లేఖకుడు నియోగి కాక వైదికుడయినా ప్రాణము మీదికి వచ్చును. తథ్యము.