కసుగాయఁ గరచి చూచిన

పధ్యం:: 

కసుగాయఁ గరచి చూచిన
మసలక తన యోగరుగాక మధురంబగునా?
పసగలుగు యువతులుండఁగఁ
బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!

తాత్పర్యము: 
పక్వానికి వచ్చిన పళ్లను వదిలి పచ్చికాయలను తింటే వగరుగా ఉన్నట్లే, చాతుర్యం గల పడుచులు ఉండగా పసిపాపలను కూడెడు వానికి సుఖము శూన్యము. అలాంటివాడు నిజంగా పశువే.