తల వంచుకుంటే ఏడు గోడల చాటన్నట్టు

లౌక్యం తెలుసుకొని మసులుకోవాలి అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. అనువుగాని చోట అధికులమనరాదు అనే దానికి ఇది సమానార్థకం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కాస్తంత ఓపిక పట్టినట్టు, అవమానం కలిగినప్పుడు అవమాన పరిచినవారిని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు కాస్తంత తగ్గితే ఆ తర్వాత అంతా చక్కగా నడుస్తుందని చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఏడు గోడల చాటు అనంటే రక్షణతో ఎంతో భద్రంగా ఉండటం అని అర్థం. కొద్దిగా తగ్గిఉంటే ఎదురొచ్చిన కష్టాలు పోవటమేకాక ఆ తర్వాత ఎంతోమంది వల్ల సహాయం కూడా లభించే అవకాశం ఉందని వివరిస్తుంది ఈ జాతీయం. తలవంచుకొంటే ఏడుగోడల చాటన్నారు. ఈ ఒక్కసారికి ఓపిక పట్టు, ఆ తర్వాతంతా నీదే పైచేయి అవుతుంది' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

 

సేకరణ: ఈనాడు.నెట్