చేతిలో కాసు నోటిలో దోసె అన్నట్టు

డబ్బిచ్చిన తర్వాతే ఏ పనైనా జరిగేది అని, అప్పు ఇవ్వడం లేదని చెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. సర్వకాలాలలోనూ జాతీయాలు ఆవిర్భవిస్తూనే ఉంటాయి. ఆనాటి కాలపరిస్థితులు వీటికి వేదికలవుతాయి. అప్పుడు వాడుకలో ఉన్న పదాలతోనే జాతీయాలు రూపొందుతుంటాయి. అలాంటి వాటి వరసలోనిది ఈ జాతీయం. ముందుగా డబ్బు ఇస్తేనే దోసె ఇస్తానని అన్న వ్యాపారి మాటలే దీనికి ఆధారం. చేతిలో కాసు నోటిలో దోసె అన్నతీరులో ముందుగా   డబ్బిస్తేనే మనం అడిగిన పని చేస్తామంటున్నాడు వాడు'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

 

సేకరణ: ఈనాడు.నెట్