గాజుపూసల గనిలో మణి దొరకదన్నట్టు

విలువలు లేనివారు ఎక్కువగా ఉన్నచోట విలువ కలిగినవారు ఉండరు అని నిర్ధరించి చెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. మణిమాణిక్యాల కన్నా గాజుపూసలకు విలువ తక్కువగా ఉంటుంది. కేవలం గాజుపూసలు దొరికే చోట విలువైన మణిమాణిక్యాలు ఉండటానికి అవకాశం లేదు అనే భావన ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. ''గాజు పూసల గనిలో మణి దొరకదన్నట్టు అక్కడున్న వారిలో ఎవరూ మంచివారు లేరు'' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

 

సేకరణ: ఈనాడు.నెట్