రాఘవా స్వస్తి, రావణా స్వస్తి అన్నట్లు

లోకమంతా శుభకరంగా ఉండాలని కొంతమంది కోరుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. పాపం, పుణ్యం పరమాత్ముడికే ఎరుక, నేను మాత్రం ఎలాంటి భేదాన్ని పాటించకుండా అందరికీ శుభం కలగాలని కోరుకుంటాను అని రాముడులాంటి వారైనా, రావణుడిలాంటివారు ఎవడైనా సరే అంతా క్షేమంగానే ఉండాలన్నది నా ఆకాంక్ష అని అనుకునేవారు ఈ జాతీయాన్ని వాడుతుండటం కనిపిస్తుంది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్