ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు..

కొన్ని సందర్భాలలో దుర్మార్గులకు, మంచివారికి ఏదో ఒకటి రెండు పోలికలు కనిపిస్తుంటాయి. అంత మాత్రం చేత దుర్మార్గులు ఎప్పుడూ మంచివారితో సమానులు కారు అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఏనుగుకు తొండమున్నట్టే దోమకు కూడా చిన్న తొండం లాంటి అవయవం ఉంటుంది. కానీ ఏనుగువల్ల సమకూరే ప్రయోజనాలు వేరు. దోమవల్ల కలిగే నష్టాలు వేరు. మంచివారు, చెడ్డవారు ఒకటిరెండు పోలికలతో ఉన్నా చెడ్డవారు మంచివారుగా ఎప్పుడూ ఉండలేరు అని తెలియచెప్పే జాతీయం ఇది.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్