మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టు

తలచిన పనులు వెనువెంటనే జరిగిన సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఎంతో దూరాన ఉన్న ఒక దేవాలయంలోని దేవుడికి మొక్కుకుంటే అంతా మంచి జరుగుతుందని ఓ వ్యక్తి ఆ దేవుడికి మొక్కుకోవాలని సంకల్పించాడట. అయితే ఆ మరుక్షణంలోనే ఆ దేవుడే అతడికి ఎదురైతే ఎలా ఉంటుందో తెలియచెప్పే భావన ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. 'మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టు ఆయన కోసం వెతుకుతుంటే ఆయనే నాకు ఎదురువచ్చాడు' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

 

 

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్