చేతిలో పని ఉన్నా నోట్లో నాలుక ఉండాలన్నట్టు

భావవ్యక్తీకరణ నైపుణ్యాల అవసరాన్ని గురించి తెలియచెబుతుంది ఈ జాతీయం. ఇటీవలి కాలంలో గొప్పగొప్ప ఉన్నత విద్యలు ఎన్ని చదివినా భావవ్యక్తీకరణ నైపుణ్యం లేనందువల్ల ఉద్యోగాలలో యువత నిలబడలేకపోతున్నారన్న సత్యం తెలియవస్తోంది. ఈ సత్యాన్ని ఇంతకు ముందెప్పుడో మన పెద్దలు గుర్తించారు కనుకనే ఈ జాతీయాన్ని వాడుకలోకి తెచ్చారు. ''చేతిలో పని ఉన్నా నోట్లో నాలుక ఉండాలన్నట్టు వీడు ఎంత చదివితేనేం అధికారులు అడిగిన దానికి సరైన పద్ధతిలో సమాధానాలు చెప్పనందు వల్లనే నెగ్గుకు రాలేకపోయాడు'' అనే లాంటి ప్రయోగాలున్నాయి.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్