అడ్డు గోడ

ఆటంకంగా నిలవటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. ఒక వ్యక్తి మరో వ్యక్తి అభివృద్ధికి కానీ, అభీష్టానికి కానీ ఆటంకం కలిగిస్తూ ఇబ్బంది పెడుతుండే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం జరుగుతుంటుంది. కంటిచూపుమేర వరకు చూడటానికి కానీ చక్కగా నడచి వెళ్లటానికి గానీ వీలున్న సందర్భంలో ఎవరైనా మధ్యలో అడ్డంగా గోడకడితే ఇటువారు అటు వెళ్లటం గానీ, చూడటం గానీ వీలుకాదు. హాయిగా గడచిపోవాల్సిన పనులు నిలిచిపోతాయి. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ఆవిర్భవించింది. అతడు తన దుర్మార్గ ప్రవర్తనతో మన అభివృద్ధికి అడ్డుగోడగా నిలుస్తున్నాడు అనే లాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని గమనించవచ్చు.

మూలం/సేకరణ: 
ఈనాడు.నెట్